వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయా – అన్నమయ్య సంకీర్తన

వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వెలుపలెల్ల తనలోనుగాక తను విడువదువెడమాయా
నలువున యోగీంద్రులెల్ల మునునడచినమార్గంబు
॥చ1॥
జీవము నిర్జీవముగాక సిద్ధించదు పరము
వావులెల్ల నొకవావిగాక మఱీ వదలదు ప్రపంచము
భావంబెల్ల నభావముగాక పాయదు కర్మంబు
దైవజ్ఞులు మును నడచి రిదియపో తప్పనిమార్గంబు
॥చ2॥
మాటలెల్లఁ గడమాటలుగాక మాయదు మలినంబు
కూటంబులు కాలకూటంబుగాక కొనకెక్కదు భవము
చాటుఁదృష్ణ లగచాటునఁబడక చాలదు సౌఖ్యంబు
తేటగా మును పెద్ద లివియపో తేర్చినమార్గంబు
॥చ3॥
గుణములెల్ల నిర్గుణముగాక తలకూడదు శాంతంబు
అనువున కనువై అంతయుఁ దాగాక ఆనందము లేదు
ప్రణుతింపఁగ శ్రీవేంకటరమణుని బహుళమహిమెల్లా
గణనకెక్కఁగా పురాతనులు మును కడకట్టినమతము
రాగము: లలిత
రేకు: 0091-05
సంపుటము: 1-451

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత

చదవండి :  ఇందరికి నభయంబు లిచ్చుచేయి - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: