వెలయునిన్నియును వృధా వృధా
॥పల్లవి॥ వెలయునిన్నియును వృధా వృధా తలఁపున శ్రీహరిఁ దడసినను ॥చ1॥ ఎడయలేనిపుణ్యము లెన్నియైనా విడువక సేయుట వృధా వృధా బడిబడి నే శ్రీపతి నాత్మలోఁ దడవక యితరము దడవినను ॥చ2॥ యెరవులతపముల నెంతైనా విరవిరవీఁగుట వృధా వృధా హరినచ్యుతుఁ బరమాత్మునిని మరచి తలఁచక మఱచినను ॥చ3॥ దైవము నెఱఁగక తమకమున వేవేలైన వృధా వృధా శ్రీవేంకటగిరిచెలువునిని సేవించక మతిఁ జెదరినను |
రాగము: రామక్రియ రేకు: 0014-02 సంపుటము: 1-84 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, రామక్రియ