వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి- – అన్నమయ్య సంకీర్తన

వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి-
కుఱుచబుద్దుల నెట్టు గూడుదునయ్య
॥చ1॥
దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడు
ద్రోహిగాక నేఁడు దొరయట
ఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నే
సాహమున నెట్టు చాలుదునయ్య
॥చ2॥
తోడఁబుట్టినవాని తొడరి చంపెడువాఁడు
చూడ దుష్టుఁడుగాక సుకృతియట
పాడైనయిటువంటిపాపబుద్దులుసేసి
నీడ నిలువ నెట్టు నేరుతునయ్య
॥చ3॥
కొడుకు నున్నతమతిఁ గోరి చంపెడువాఁడు
కడుఁబాతకుఁడుగాక ఘనుఁడట
కడలేనియటువంటికలుషవ్రిత్తికి నాత్మ
వొడఁబరపఁగ నెట్లోపుదునయ్య
॥చ4॥
తల్లిఁ జంపెడువాఁడు తలఁప దుష్టుఁడుగాక
యెల్లవారల కెల్ల నెక్కుడట
కల్లరియనుచు లోకము రోయుపని యిది
చెల్లఁబోనే నేనేమి సేయుదునయ్య
॥చ5॥
యింటివేలుపు వేంకటేశ్వరుఁ దనవెంట-
వెంటఁదిప్పెడువాఁడు విభుఁడట
దంటనై యాతనిదాసానుదాసినై
వొంటినుండెద నేమి నొల్లనోయయ్య
రాగము: శ్రీరాగం
రేకు: 0038-05
సంపుటము: 1-235

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  మనసున నెప్పుడు మానదిది

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *