వెరపులు నొరపులు వృధా వృధా – అన్నమయ్య సంకీర్తన

వెరపులు నొరపులు వృధా వృధా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వెరపులు నొరపులు వృధా వృధా
ధరపై మరయంతయును వృధా
॥చ1॥
తడయక చేసినదానంబులు వృథ
యెడనెడ నెఱిఁగిన యెఱుక వృథా
వొడలిలోనిహరి నొనరఁగ మతిలోఁ
దడవనిజీవమె తనకు వృథా
॥చ2॥
జగమునఁ బడిసినసంతానము వృథ
తగిలి గడించినధనము వృథ
జగదేకవిభుని సకలాత్ముని హరిఁ
దెగి కొలువనిబుద్దియును వృధా
॥చ3॥
పనివడికూడిన పరిణామము వృథ
వొనరఁగనుందినవునికి వృథా
ఘనుఁడుగు తిరువేంకటగిరి హరిఁగని
మననేరని జన్మములు వృథా
రాగము: ముఖారి
రేకు: 0035-04
సంపుటము: 1-217

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *