
వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వెడమంత్ర మిఁకనేల వేరువెల్లంకులు నేల పుడమిధరుఁడు మాఁకు భువనౌషధము ॥చ1॥ హరి యచ్యుతాయంటే నణఁగుఁ బాపములు నరసింహ యనియంటే నాఁటినదుఁఖములు మాను పురుషోత్తమాయంటేఁ బుండ్లు బూచులు మాను పరమౌషధ మీతఁడే పాటింప మాకు ॥చ2॥ వాసుదేవ యనియంటే వదలు బంధములెల్లా వాసికి గృష్ణాయంటే వంతలరోగాలు మాను శ్రీసతీశ యనియంటే చింతలిన్నియును మాను గాసిదీర నితడేపో ఘనదివ్యౌషధము ॥చ3॥ గోవిందా యనియంటేఁ గూడును సంపదలు యీవల మాధవయంటే నిహముఁ బరముఁ జేరు దేవ నారాయణయంటే దేహము సుఖియై యుండు శ్రీవేంకటేశుఁడే మాకు సిద్ధౌషధము |
రాగము: ముఖారి రేకు: 0093-03 సంపుటము: 1-461 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి