
విశ్వప్రకాశునకు వెలిఁయేడ లో నేడ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ విశ్వప్రకాశునకు వెలిఁయేడ లో నేడ శాశ్వతున కూహింప జన్మమిఁక నేడ ॥చ1॥ సర్వపరిపూర్ణునకు సంచారమిఁక నేడ నిర్వాణమూర్తికిని నిలయమిఁక నేడ వుర్వీధరునకుఁ గాలూఁదనొక చోటేడ పార్వతీ స్తుత్యునకు భావమిఁక నేడ ॥చ2॥ నానాప్రభావునకు నడుమేడ మొదలేడ ఆనన సహస్రునకు నవ్వలివ లేడ మౌని హృదయస్థునకు మాటేడ పలుకేడ జ్ఞాన స్వరూపునకుఁ గాన విననేడ ॥చ3॥ పరమ యోగీంద్రునకు పరులేడ తా నేడ దురితదూరునకు సంస్తుతి నింద లేడ తిరువేంకటేశునకు దివ్యవిగ్రహ మేడ హరికి నారాయణున కవుఁగాము లేడ |
రాగము: కన్నడగౌళ రేకు: 0068-04 సంపుటము: 1-355 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ