వివేకమెఱఁగనివెఱ్ఱులముగాక నేము – అన్నమయ్య సంకీర్తన

వివేకమెఱఁగనివెఱ్ఱులముగాక నేము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వివేకమెఱఁగనివెఱ్ఱులముగాక నేము
దివారాత్రము నిన్నే ద్రిష్టించవలదా
॥చ1॥
మానివోడ నమ్మి వొక్కమనుజుఁడు వార్ధి దాఁటి
నానార్థములు గూర్చి నటించఁగాను
దానవారికృప నమ్మి తగినసంసారవార్థి-
లోను చొచ్చి దాఁటి గెల్వ లోకులకుఁ జెల్లదా
॥చ2॥
జుట్టెఁడుయినుము నమ్మి సొరిది నొక్కఁడు భూమిఁ
గట్టిడిభయములెల్లఁ గడవఁగాను
నెట్టనఁ జక్రాయుధుని నిజనామ మిటు నమ్మి
తట్టి భవభయములు తరి దాఁటఁజెల్లదా
॥చ3॥
వేలెఁడుదీపము నమ్మి వెడఁగుఁజీఁకటిఁ బాసి
పోలిమి నొక్కనరుఁడు పొదలఁగాను
ఆలించి శ్రీవేంకటేశుఁ డాత్మలో వెలుఁగగాను
మేలి మాతనిఁ గొలిచి మెరయంగఁవలదా
రాగము: బౌళి
రేకు: 0088-01
సంపుటము: 1-429

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి

చదవండి :  జనులు నమరులును జయలిడఁగా - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: