విడుమనవో రోలు విడుమనవో వేగ – అన్నమయ్య సంకీర్తన

విడుమనవో రోలు విడుమనవో వేగ – అన్నమయ్య సంకీర్తన

శ్రీరాగం, యేకతాళి
॥పల్లవి॥
విడుమనవో రోలు విడుమనవో వేగ
విడుమనవో తల్లి వెఱచీ, నీబాలుడు
॥చ1॥
యెన్నఁడు గొల్లెతలయిండ్లు వేమారుఁ జొచ్చి
వెన్నలుఁ బాలును వెఱఁజఁడు
వన్నెలనీకోప మింత వద్దు నీకు నీయాన
కన్నుల నవ్వుల ముద్దుగారీ నీబాలుడు
॥చ2॥
సారేకు పెరుగులచాడెలూ నేఁడు మొదలూ
గోరయై కోలలఁ బగుల మొత్తఁడు
కూరిమిలేక నీవు కోపగించఁగాఁ గన్నీరు
జోరుగా రాలఁగా నిన్నే చూచీ నీబాలుఁడు
॥చ3॥
చాలు నీకోప మిది సరిలేనిమద్దులివి
రోలనే యిట్లను విరుగఁద్రోయఁడు
మేలిమివేంకటపతి మేటిఁనీకొమాఁరు డిదె
కేలెత్తి నీకు మ్రొక్కెడి నిదె బాలుఁడు
రాగము: తెలియదు
రేకు: 0009-03
సంపుటము: 1-57

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs

చదవండి :  అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు ప్రారంభం

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: