
వాసివంతు విడిచినవాఁడే; యోగి యీ-
॥పల్లవి॥ వాసివంతు విడిచినవాఁడే; యోగి యీ- అసలెల్లా విడిచిన అతఁడే యోగి ॥చ1॥ గద్దించి పారెడుతురగమువంటి మనసు వద్దని మరలించినవాఁడే యోగి వొద్దనే కొండలవంటి వున్నత దేహగుణాలు దిద్ది మట్టుపెట్టువాఁడే ధీరుఁడైన యోగి ॥చ2॥ ముంచుకొన్న యింద్రియపు మోహజలధిలోన వంచన మునుఁగనట్టివాఁడే యోగి పొంచి పుణ్యపాపములు పొట్టువంటి కర్మములు దంచి పారఁజల్లువాఁడే తత్త్వమైన యోగి ॥చ3॥ వెగటుకామాదుల వెళ్ళఁగొట్టి శాంతుఁడై వగలుడిగినయట్టివాఁడే యోగి నిగిడి శ్రీవేంకటేపతి నిజదాసుఁడై భక్తిఁ దగిలి నిలుపువాఁడే ధన్యుఁడైన యోగి |
రాగము: సాళంగనాట రేకు: 0027-06 సంపుటము: 1-167 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సాళంగనాట