
వలెనను వారిదె వైష్ణవము యిది – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వలెనను వారిదె వైష్ణవము యిది వలపుఁ దేనెవో వైష్ణవము ॥చ1॥ కోరిక లుడుగుచు గుఱి నిన్నిటిపై వైరాగ్యమెపో వైష్ణవము సారెకుఁ గోపముఁ జలమునుఁ దనలో వారించుటవో వైష్ణవము ॥చ2॥ నుడిగొను దేహపు సుఖదుఃఖములో వడిఁ జొరనిదెపో వైష్ణవము ముడివడి యింద్రియముల కింకరుఁడై వడఁబడనిదెపో వైష్ణవము ॥చ3॥ వుదుటునఁ దన సకలొపాయంబులు వదలుటపో నిజవైష్ణవము యెదుటను శ్రీవేంకటేశ్వరు నామము వదనము చేర్చుట వైష్ణవము |
రాగము: మలహరి రేకు: 0084-01 సంపుటము: 1-405 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, మలహరి