వలవని మోహావస్థలఁ బొరలెడి –

వలవని మోహావస్థలఁ బొరలెడి –

॥పల్లవి॥
వలవని మోహావస్థలఁ బొరలెడి –
మలినం బెన్నఁడు మానును –
॥చ1॥
ఘెరదురితవికారంబుల
కారణ మెన్నఁడు దీరును
వైరముగొని తనువదలనిబంధపు –
భారం బెన్నఁడు వాయును
॥చ2॥
జడమగుజిహ్వచాపల్యముగల –
వెడమతి యెన్నండు వీడును
చెడనిజీవునకు శ్రీవేంకటపతి-
కడుచూ పెన్నఁడు గటుగును
రాగము: లలిత
రేకు: 0028-06
సంపుటము: 1-174

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలిత

చదవండి :  ఏఁటికి దలఁకెద రిందరును

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *