వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు – అన్నమయ్య సంకీర్తన

వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
వలచి పైకొనఁగరాదు వలదని తొలఁగరాదు
కలికిమరుఁడు సేసినాజ్ఞ కడవఁగరాదురా
॥చ1॥
అంగడి కెత్తినట్టిదివ్వె లంగనముఖాంబుజములు
ముంగిటి పసిఁడికుంభములును ముద్దులకుచయుగంబులు
యెంగిలిసేసినట్టితేనె లితవులైన మెఱుఁగుమోవులు
లింగములేని దేహరములు లెక్కలేని ప్రియములు
॥చ2॥
కంచములోని వేఁడికూరలు గరువంబులుఁ బొలయలుకలు
యెంచఁగ నెండలోనీడలు యెడనెడకూటములు
తెంచఁగరాని వలెతాళ్ళు తెలివిపడనిలేఁతనవ్వులు
మంచితనములోని నొప్పులు మాటలలోనిమాటలు
॥చ3॥
నిప్పులమీఁద జల్లిననూనెలు నిగిడితనివిలేనియాసలు
దప్పికి నేయిదాగినట్లు తమకములోనితాలిమి
చెప్పఁగరానిమేలు గనుట శ్రీవేంకటపతిఁ గనుటలు
అప్పనికరుణగలిగి మనుట అబ్బురమైనసుఖములు
రాగము: సామంతం
రేకు: 0001-01
సంపుటము: 1-1

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  వననిధిఁ గురిసిన వానలివి మతి- - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: