
రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ రెండుమూలికలు రేయిఁబగలు నున్నవి అండదేహమం దొకటి అతుమలో నొకటి ॥చ1॥ యిదివో రసబద్ధము యింద్రియములు మేనిలో పదిలముగా నిలిపి బంధించుట అదివో వేధాముఖ, మంతరంగపుమనసు చెదరకుండాఁ జొనిపి శ్రీహరిఁదలఁచుట ॥చ2॥ తారవిద్య గంటిమి తగిలి నాసాగ్రమందు మేరతో ద్రిష్టినిలిపి మేలుఁబొందుట చేరువ సువర్ణవిద్య, చిత్తములోఁ బ్రణవము ధీరత నాదము సేసిఁ దేవునిఁ బొగడుట ॥చ3॥ పుటజయమాయ నిట్టె పుణ్యపాపము లందులో కుటిలపుఁగోరికల కొన దుంచుట యిటులనే శ్రీవేంకటేశుఁ డిందిరయును అటు ప్రక్రృతిపురుషులనుటొరవచ్చుట |
రాగము: గౌళ రేకు: 0091-06 సంపుటము: 1-452 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గౌళ