శనివారం , 21 డిసెంబర్ 2024
సీమపై వివక్ష

హైదరాబాద్ లేకపోతే బతకలేమా!

సమైక్య రాష్ట్రంలో రాయలసీమ వాసులవి బానిస బతుకులు తప్ప అభివృద్ధి దిశగా అడుగులు వేయడం అసాధ్యమని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యులు, రాయలసీమ ఉద్యమ నేత ఎం.వి.రమణారెడ్డి పేర్కొ న్నారు.

రాయలసీమ ప్రజా ఫ్రంట్ కన్వీనర్ యుగంధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ వెనుక బాటు తనంపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయ న మాట్లాడుతూ హైదరాబాద్ లేకపోతే తాము బతకలేమనే విధంగా ఇవాళ ఉద్యమం కొనసాగడం సరైంది కాదన్నారు.

చదవండి :  'పెన్నేటి పాట'కు రాళ్ళపల్లి కట్టిన పీఠిక

తెలంగాణ ప్రాంతం వారు విడిపోతామని కోరుతున్నా, ఇంకా కలిసే ఉందామంటూ పాకులాడటం తగదన్నారు.

ఇన్నేళ్ళ సమైక్యాంధ్రప్రదేశ్‌లో కూడా రాయలసీమలో ఏమీ లేదనే మాట అందరినోటా నానుతుందనే దానికన్నా, ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఏనాడూ గొంతెత్తి రాయలసీమ కు ఫలానా కావాలి అంటూ అడిగిన పాపాన పోలేదన్నారు. రాయలసీమ ఇంత వెనుకబడేందుకు కారకులు ప్రజలు కాదని, అన్ని పార్టీల ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమేనన్నారు.

విభజన ప్రకటన వెలువడినప్పటి నుంచి సీమాంధ్రలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు నిద్రరావడం లేదన్నారు.

చదవండి :  సొంత నియోజకవర్గాల్లో ఖంగుతిన్న డిఎల్, మైసూరా

ఇప్పటికైనా సమైక్య ఉద్యమాన్ని పక్కనపెట్టి సీమ భవితవ్యం కోసం ప్రత్యేక రాయలసీమ బాట పట్టాలని వక్తలు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: