జిల్లా ఇంచార్జ్ మంత్రిగా నియమితులైన రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమశాఖామంత్రి రావెల కిశోర్‌బాబు ఈ రోజు జిల్లాకు వస్తున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తిరుపతి నుంచి రోడ్డుమార్గాన రాజంపేటకు బయలుదేరి మధ్యాహ్నం గం.1.30కు చేరుకొని, స్థానిక ర.భ.శాఖ కార్యాలయంలో విశ్రాంతి తీసుకుంటారు.
సాయంత్రం గం.4.00కు కడపకు చేరుకొని, అక్కడి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, అనధికారులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడే బసచేసి 15న కడపలో జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఎర్రగుంట్ల మీదుగా పోట్లదుర్తికి చేరుకొని అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో హైదరాబాద్‌కు బయలుదేరి వెళుతారని రాజంపేట ఆర్డీవో ఎం.విజయసునీత తెలిపారు.
మొదటి సారి జిల్లాకు వస్తున్న మంత్రి గారికి రాయలసీమ విద్యార్తి సంఘాల నుండి నిరసనలు ఎదురయ్యే అవకాశం ఉంది.