నాకు సిపిఐ పార్టీ అంటే ఎప్పటినుంచో అభిమానం ఉంది కానీ ఈ మద్యన ఆ అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది…
రాయలసీమ సిపిఐ నాయకులు రాయలసీమకు రాజధాని ,నీళ్ళు కావాలని అంటారు
కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమకు చెందినవాడే – కానీ ఆయన మాత్రం…
రాజధాని గుంటూరు-విజయవాడ మద్య ఉండాలంటాడు ..!.
కృష్ణా డెల్టాకునీళ్ళు కావాలంటాడు…!
పోలవరాన్ని నిర్మించాలంటాడు…!
కాకినాడ -వైజాగ్ కారిడార్ నిర్మించాలంటాడు!
కానీ ఈయనకు రాయలసీమ లో కరువుకు నీళ్ళులేక అల్లాడుతున్న ప్రజల దుస్థితి పట్టదు
పశువులకు మేత లేక తెలంగాణకు ,ఆంధ్రాకు పశువులను అమ్ముకొనే మా రైతుల గురించి పట్టదు
మా రాయలసీమ గురించి మా నాయకులకు అస్సలు పట్టదనేదానికి ఇదే నిదర్శనం
ఇప్పుడు రాయలసీమ సిపిఐ నాయకులు పోరాడాల్సింది ఆ పార్టీ నాయకత్వం మీదనా ? అధికార పార్టీ మీదనా ?
– చేతన్, యోవేవి
(ఫేస్బుక్ పోస్టు ఆధారంగా)