
రాజధాని వాడికి…రాళ్ళ గంప మనకు
రాజధాని వాడికి
రాళ్ళ గంప మనకు
సాగు నీళ్ళు వాడికి
కడగండ్లు మనకు
స్మార్ట్ సిటీలు వాడికి
చితి మంటలు మనకు
వాటర్ బోర్డ్ వాడికి
పాపర్ బ్రతుకులు మనకు
ఎయిమ్స్ వాడికి
ఎముకల గూల్లు మనకు
అన్నపూర్ణ వాడికి
ఆకలి చావులు మనకు
పోలవరం వాడికి
కరువు శాపం మనకు
యూనివర్సిటీలు వాడికి
యురేనియం సావులు మనకు
కాసుల పంట వాడికి
మాసిన సదువు మనకు
కనక వర్షం వాడికి
కూనీ సంస్కృతి మనకు
ఉండేదంతా వాడికే
పోగా మిగిలింది పోరాటమే
జై రాయలసీమ………..
జై జై రాయలసీమ……..
జై జై జై రాయలసీమ….
– సొదుం శ్రీకాంత్
(ఫేస్ బుక్ పోస్టు యధాతదంగా)