ఆదివారం , 22 డిసెంబర్ 2024

రాజగోపాల్‌రెడ్డి పెద్దకర్మకు ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం జిల్లాలోని లక్కిరెడ్డిపల్లెకు రానున్నారు. మాజీ మంత్రి ఆర్,రాజగోపాల్‌రెడ్డి పెద్దకర్మ ఆదివారం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు కానున్నారు. కలెక్టర్ కోన శశిధర్,జిల్లా ఎస్పీ మనీష్‌కుమార్‌సిన్హా హెలిప్యాడ్ స్థలాన్ని శుక్రవారం పరిశీలించారు.

చిత్తూరు జిల్లాలో స్వగ్రామమైన కలికిరికి శనివారం ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఆదివారం ఉదయం 11 గంటలకు హెలీకాప్టర్‌లో లక్కిరెడ్డిపల్లెకు చేరుకుని ఆర్‌ఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారని మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గంటపాటు లక్కిరెడ్డిపల్లెలోనే గడిపి 12 గంటలకు హైదరాబాదుకు వెళతారన్నారు.

చదవండి :  బారులు తీరిన ఓటర్లు - భారీ పోలింగ్ నమోదు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: