కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి భాజపా మన జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానాన్ని కేటాయించింది. ఈమె గత లోక్సభ ఎన్నికలలో విశాపట్నం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు.
ఆ చివరి విశాఖప్నటం నుంచి తీసుకువెళ్లి రాయలసీమలోని వైఎస్ఆర్ జిల్లా రాజంపేట స్థానం కేటాయించారు. అక్కడ బిజెపి గానీ, టిడిపికి గానీ బలంలేదు. టిడిపితో పొత్తులో భాగంగా ఏరికోరి ఓడిపోయే స్థానం ఆమెకు కేటాయించారని భావిస్తున్నారు.
భాజపా అధిష్టానంపై చంద్రబాబు నాయుడు ఒత్తిడి మేరకే ఈ ఆమెకు ఓడిపోయే ఇటువంటి స్థానం కేటాయించారని భావిస్తున్నారు. పురందేశ్వరి పది సంవత్సరాలు ఎంపిగా ఉండి, కేంద్ర మంత్రిగా జాతీయ స్థాయిలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీలో పరిచయాలు పెంచుకున్నారు.
గతంలో కాంగ్రెస్ లో ఉండగా జగన్ ఒంగోలు జిల్లా ఓదార్పు యాత్రను అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించిన పురందేశ్వరి కడప జిల్లాలో జగన్ నేతృత్వంలోని వైకాపాను డీకొట్టగాలుగుతుందా!