గురువారం , 21 నవంబర్ 2024

మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై హైకోర్టు ఆదేశం

హైకోర్టు ఆదేశాలతో జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మళ్ళీ ఉత్సుకతను పెంచేలా ఉంది. ఈ నెల 4న జరిగిన ఓటింగ్ కు ఇష్టపూర్వకంగానే గైర్హాజరైన జానీ ఓటును పరిగణలోకి తీసుకోరాదని ఆదివారం (13వ తేదీన) చైర్మన్ ఎన్నికను నిర్వహిస్తూనే , ఎన్నికల వివరాలను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. అంతేకాకుండా కోరం ఉన్నప్పటికీ ఎన్నికలను వాయిదా వేసిన ఆర్డీఓపై చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

జమ్మలమడుగు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కౌన్సిలర్ సూర్యనారాయణరెడ్డి తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 3న చైర్మన్ ఎన్నిక కోసం 22 మంది సభ్యులకుగాను 21 మంది హాజరయ్యారని అయినప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా నాల్గవ తేదీకి వాయిదా వేశారని హైకోర్టుకు ఫిర్యాదు చే శారు.

చదవండి :  జమ్మలమడుగు అరాచ(జ)కీయం వెనుక కథ

ఎన్నికల సంఘం చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించినప్పటికీ నాల్గవ తేది సైతం చేపట్టలేదన్నారు. తాను స్వచ్చందంగా గైర్హాజర్ అయ్యానని కౌన్సిలర్ జానీ జడ్జి ఎదుట వాంగ్మూలం ఇచ్చారని, ఈ నేపధ్యంలో అతని ఓటు పరిగణలోకి తీసుకోరాదంటూ వారు హైకోర్టును అభ్యర్థించారు. కోర్టు ఉత్తర్వులు జిల్లా కేంద్రానికి అధికారికంగా అందాల్సి ఉంది.

గోవా నుంచి తిరిగొచ్చిన జానీ తెదేపా గూటికి చేరటంతో జమ్మలమడుగు చైర్మన్ ఎన్నికలో డ్రా తప్పదని భావించారు. కోర్టు ఆదేశాలతో మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు జరిగే కోరంలో తెదేపా బలం 10కి తగ్గనుంది. అదే సమయంలో వైకాపా బలం 11గా ఉండనుంది.

చదవండి :  కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

జానీ పేరు చెప్పి ఎన్నిక వాయిదా వేసేందుకు రభస చేసిన తెదేపా వాళ్ళు ఇప్పుడేమి చేస్తారో!

ఇదీ చదవండి!

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: