మా కెల్ల ‘ రాజానుమతో ధర్మ’ యిది నీ – అన్నమయ్య సంకీర్తన

మా కెల్ల ‘ రాజానుమతో ధర్మ’ యిది నీ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మా కెల్ల ‘ రాజానుమతో ధర్మ’ యిది నీ
యీకడఁ గలుగుట కేమరుదు
॥చ1॥
అలగరుడగమన మహిశయనంబును
కలిసి నీయందె కలిగెనటా
పొలసినపాపముఁ బుణ్యము నరులకు
యెలమి గలుగుటకు నేమరుదు
॥చ2॥
యిదె నీడకన్ను యెండకన్ను మరి
కదిసి నీయందె కలిగెనట
సదరపునరులకు జననమరణములు
యెదురనె కలుగుట కేమరుదు
॥చ3॥
శ్రీకాంత ఒకదెస భూకాంత ఒకదెస కదెన
కైకొని నీకిటు గలిగెనట
యీకడ శ్రీవేంకటేశ యిహపరము
యేకమై మా కగు టేమరుదు
రాగము: లలిత
రేకు: 0085-05
సంపుటము: 1-415

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత

చదవండి :  అయ్యోపోయఁ బ్రాయముఁ గాలము

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: