కడప జిల్లాకు చెందిన మాజీమంత్రి రాజగోపాల్ రెడ్డి గుండెపోటుతో ఈరోజు ఉదయం మృతి చెందారు. తిరుపతిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.తొలుత కాంగ్రెస్ హయాంలో 1967లో తొలిసారి శాసనసభకు ఎన్నికైన ఆయన ఎన్టీఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు.
రాజగోపాల్ రెడ్డి కడప జిల్లా లక్కిరెడ్డిపల్లి నియోజకవర్గం నుంచి మొత్తం అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు రమేష్ రెడ్డి కూడా ఒకసారి శాసనసభకు ఎన్నికయ్యారు.రాజగోపాల్ రెడ్డి అప్పట్లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్ లో మంత్రిగా పనిచేసినా తదుపరి ఆయనతో విబేదించి కాంగ్రెస్ లో చేరి 1989లో కాంగ్రెస్ పక్షాన శాసనసభకు ఎన్నికయ్యారు.
1994 లో ఆయన కుమారుడు రమేష్ తిరిగి టిడిపి తరపున గెలుపొందారు.