మలసీఁ జూడరో మగ సింహము
॥పల్లవి॥ మలసీఁ జూడరో మగ సింహము అలని మీఱిన మాయల సింహము ॥చ1॥ అదివో చూడరో ఆదిమపురుషుని పెదయౌభళము మీఁది పెనుసింహము వెదకి బ్రహ్మాదులు వేదాంతతతులు కదిసి కానఁగలేని ఘనసింహము ॥చ2॥ మెచ్చిమెచ్చి చూడరో మితిమీఱినయట్టి- చిచ్చిఱకంటితోడి జిగిసింహము తచ్చినవారిధిలోన తరుణిఁ గౌఁగిటఁ జేర్చి నచ్చినగోళ్ళ శ్రీనరసింహము ॥చ3॥ బింకమునఁ జూడరో పిరితియ్యక నేఁడు అంకపుదనుజసంహారసింహము వేంకటనగముపై వేదాచలముపై కింక లేక వడిఁ బెరిగినసింహము |
రాగము: శంకరాభరణం రేకు: 0002-07 సంపుటము: 1-13 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణం