
మఱియు మఱియు నివె మాపనులు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మఱియు మఱియు నివె మాపనులు మెఱసితి మిందే మిక్కిలిని ॥చ1॥ నారాయణునకు నమస్కారము ధారుణీపతికిని దండము శ్రీరమణునకును జేరి శరణ్యము వారిధిశాయికి వరుస జోహారు ॥చ2॥ రామకృష్ణులకు రచనలబంటను దామోదరునకు దాసుఁడను వామనమూర్తికి వాకిటిగొల్లను సోమర్కనేత్రునిసొరిదిలెంకను ॥చ3॥ గోవిందునికే కొలువులు సేతుము దేవొ త్తముబడిఁ దిరుగుదుము భావజగురునకు పంపునడతుము శ్రీ వేంకటపతి సేవింతుము |
రాగము: పాడి రేకు: 0090-06 సంపుటము: 1-446 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి