మరలి మరలి జయమంగళము – అన్నమయ్య సంకీర్తన

మరలి మరలి జయమంగళము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
మరలి మరలి జయమంగళము
సొరిది నిచ్చలును శుభమంగళము
॥చ1॥
కమలారమణికి గమలాక్షునకును
మమతల జయజయమంగళము
అమరజననికిని అమరవంద్యునకు
సుముహర్తముతో శుభమంగళము
॥చ2॥
జలధికన్యకును జలధిశాయికిని
మలయుచును శుభంమంగళము
కలిమికాంత కాకలికివిభునికిని
సుళువులయారతి శుభమంగళము
॥చ3॥
చిత్త జుతల్లికి శ్రీవేంకటపతికి
మత్తిల్లినజయం మంగళము
యిత్తలనత్తల యిరువురకాఁగిటి
జొత్తులరతులకు శుభమంగళము
రాగము: రామక్రియ
రేకు: 0091-02
సంపుటము: 1-448

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ

చదవండి :  శమము చాలనియట్టి జన్మం బిదేమిటికి - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: