
మంచిదివో సంసారము మదమత్సరములు మానిన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మంచిదివో సంసారము మదమత్సరములు మానిన కంచునుఁ బెంచును నొకసరిగాఁ దా చూచినను ॥చ1॥ ఆపదలకుమ సంపదలకు నభిమానింపక యుండిన పాపముఁ బుణ్యము సంకల్పములని తెలిసినను కోపము శాంతము తమతమగుణములుగా భావించిన తాపము శైత్యమునకుఁ దాఁ దడఁబడకుండినను ॥చ2॥ వెలియును లోపలయును నొకవిధమై హృదయం బుండిన పలుకునుఁ బంతము దా నొక భావన దోఁచినను తలఁపునఁ దిరువేంకటగిరిదైవము నెలకొనియుండిన సొలపక యిన్నిటికినఁ దా సోఁకోరుచెనైనా |
రాగము: లలిత రేకు: 0007-01 సంపుటము: 1-45 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత