
భావమునఁ బరబ్రహ్మ మిదె – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ భావమునఁ బరబ్రహ్మ మిదె కైవసమై మాకడ చూడ ॥చ1॥ నీలమేఘ ముపనిషదర్ధం బదె పాలుదొంగిలెడిబాలులలో చాలు నదియ మాజన్మరోగముల- చీల దివియ మముఁ జెలగిఁచ ॥చ2॥ తనియని వేదాంతరహంస్యంబదె వొనర గోపికలవుట్లపై పనుపడి సకలాపజ్జాలంబుల- పనులు దీర్చ మముఁ బాలించ ॥చ3॥ భయములేని పెనుఁబరమపదం బదె జయమగు వేంకటశైలముపై పయిపడు దురితపుఁబౌఁజుల నుక్కున లయము సేయ మము లాలించ |
రాగము: సామంతం రేకు: 0042-04 సంపుటము: 1-258 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం