
భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా- కేలీ విహార లక్ష్మీనరసింహా read ॥చ1॥ ప్రళయమారుత ఘెరభస్త్రికా పూత్కార లలితనిశ్వాసడోలారచనయా కులశైలకుంభినీకుముదహితరవిగగన- చలనవిధినిపుణ నిశ్చల నారసింహా ॥చ2॥ వివరఘనవదనదుర్విహసననిష్ఠ్యూత – లవదివ్య వరుషలాలాఘటనయా వివిధజంతువ్రాతభువన మగ్నీకరణ నవనవప్రియ గుణార్ణవ నారసింహా ॥చ3॥ దారుణోజ్జ్వలధగద్దగితదంష్ట్రానలవి కారస్ఫులింగసంగక్రీడయా వైరిదానవఘోరవంశభస్మీకరణ – కారణ ప్రకటవేంకట నారసింహ |
రాగము: శ్రీరాగం రేకు: 0046-02 సంపుటము: 1-281 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం