గురువారం , 21 నవంబర్ 2024

బోడో మిలిటెంట్ల చెరలో జిల్లావాసి

అస్సోం రాష్ట్రంలో కాంట్రాక్టు పనులు చేయిస్తున్న పప్పిరెడ్డి మహశ్వరరెడ్డిని ఆదివారం బోడో మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. మహశ్వరరెడ్డి రామాపురం మండలం హసనాపురం గ్రామ వాసి. దివాస్ జిల్లా గౌడీ(అటవీ) ప్రాంతంలో ఇతను కిడ్నాప్‌కు గురైనట్లు బంధువులు తెలిపారు. క్లాస్‌వన్ కాంట్రాక్టర్ అయిన మహేశ్వరరెడ్డి గుజరాత్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, అస్సోం రాష్ట్రాలలో ఐఎల్‌ఎఫ్( రాంకీ కంపెనీ )లో సబ్ కాంట్రాక్టర్‌గా పని చేయిస్తున్నారు.

వారం రోజుల నుంచి అక్కడే ఉండి పనులు పర్యవేక్షించి ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చేందుకు విమానం టికె ట్ కూడా మహేశ్వరరెడ్డి సిద్ధం చేసుకున్నారు. ఉదయం పనుల వద్దకు సైట్ ఇంజనీర్‌తో కలసి వెళ్తుండగా మహేశ్వరరెడ్డితో పాటు సైట్ ఇంజనీర్‌ని మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత సైట్ ఇంజనీర్‌ను వదిలిపెట్టినట్లు సమాచారం.

చదవండి :  వైఎస్ఆర్ కాంగ్రెస్­ ప్లీనరీ విశేషాలు

హసనాపురం పంచాయతీకి మహేశ్వరరెడ్డి ఢిల్లీలో ఏజీబీఎస్సీ చదివి క్లాస్ వన్ కాంట్రాక్టర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. భార్య సుభద్రమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమార్తె నిషితాకు ఇటీవలే వివాహం చేశారు. ఆయన గతంలో హసనాపురం గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. .

హైదరాబాదులోని ఆయన బంధువులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ద్వారా అస్సోం ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్‌తో కిడ్నాప్ విషయం గురించి మాట్లాడినట్లు సమాచారం. కిడ్నాప్ సమాచారం తెలుసుకున్న రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే మోహన్‌రెడ్డిలు హుటాహుటిన అస్సోంకు బయలుదేరి వెళ్లారు.

చదవండి :  'రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాల'

మహేశ్వరరెడ్డి కిడ్నాప్‌ విషయంపై అస్సోం రాష్ట్ర అడిషనల్ డీజీపీ ఆర్‌పి ఠాకూర్‌తో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి చర్చించారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్మీ రంగంలోకి దిగినట్లు అడిషనల్ డీజీపీ తెలిపారు. రాత్రి వేళ కూడా మహేశ్వరరెడ్డికోసం గాలిస్తామన్నారు. అలాగే ఆ రాష్ర్ట ముఖ్యమంత్రి పేషీలో పనిచేస్తున్న అధికారి భానుతో, దివాస్ జిల్లా ఎస్పీతో కూడా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఉద యం అస్సోంకు బయలుదేరి వెళ్లనున్నారు.

చదవండి :  తెదేపా నేతపై కేసు నమోదు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: