బేస్తవారం లేదు బేస్తారం అనే పదానికి అర్థాలు, వివరణలు

    బేస్తవారం లేదు బేస్తారం అనే పదానికి అర్థాలు, వివరణలు

    కడప జిల్లాలో వాడుకలో ఉన్న బేస్తవారం అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘బేస్తవారం’ in Telugu Language.

    బేస్తవారం :

    నామవాచకం (noun), ఏకవచనం (Singular)

    • గురువారం
    • శుక్రవారానికి ముందు రోజు
    • బృహస్పతివారము
    • Thursday (ఆంగ్లం)

    వివరణ :

    బేస్తవారం లేదా బేస్తవారము అనేది వారంలోని ఏడు రోజులలో ఒక రోజు. కడప జిల్లాలో బేస్తవారం అనే పదాన్ని Thursday అనే ఇంగ్లీషు పదానికి సమానార్థకంగా వాడతారు. దీనినే కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ‘బేస్తారం’ లేదా ‘బేచ్చారం’ అని కూడా వ్యవహరిస్తారు.

    చదవండి :  గోవాకు లేదా గొవాకు అనే పదానికి అర్థాలు, వివరణలు

    వాడుక :

    • బేస్తవారం నాడు పొద్దుగూకేసరికి అందరం తయారై గుట్టకాడికి చేరుకునేది
    • బేస్తవారం నుంచి నీలకంఠరావుపేట ఉరుసు
    • బేస్తవారం సందేళకాడ కొడుకు, కోడలు ఇద్దరూ తయారైపోయినారు

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *