బిందు సేద్యం చేయండి: చంద్రబాబు
ఊటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన
కడప: జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు.
తర్వాత రామాపురం మండలం నల్లగుట్టపల్లి చేరుకొని అక్కడి నీరు-చెట్టు పనులను పరిశీలించారు. అనంతరం కడపకు వచ్చిన ఆయన ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నీరు – ప్రగతి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంతపురం జిల్లాకు ఇస్తున్న మాదిరిగా కడప జిల్లా రైతులకు బిందు సేద్యం విషయంలో ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేస్తామన్నారు. కడప జిల్లాను ఉద్యాన పంటల హబ్ గా మారుస్తామన్నారు. అరటి, ఉల్లి వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు.
ఈ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చేదానికి ఎన్టీఆర్ గాలేరు నగరి, హంద్రీ నీవా పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. జిల్లాలో 644 చెరువులున్నాయన్నారు, గొలుసుకట్టు పద్ధతిలో వీటిని నీటితో నింపవచ్చన్నారు. నీరు-చెట్టు, పంట సంజీవని పథకం ద్వారా జిల్లాలో భూగర్భజలాలు పెరిగి, కరవును రూపుమాపవచ్చన్నారు. పంటకుంటల తవ్వకాలకు రైతులకు ముందుకురావాలన్నారు. ఉపాధి హామీ కింద ఖర్చు చేసే ఈ నిధులకు ఎలాంటి పరిమితి లేదన్నారు. భూగర్భజలాల పెంపు, సిమెంట్ రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.
చివరలో కడప జిల్లా పర్యాటక అభివృద్ధిపైన ప్రముఖ సినీ దర్శకుడు నీలకంఠ పర్యవేక్షణలో రూపొందించిన పాటల సీడీనీ ముఖ్యమంత్రి విడుదలచేశారు.
అనంతరం రాయచోటి రోడ్డులో వూటుకూరు వద్ద రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, రాజ్యసభసభ్యుడు సీఎం రమేశ్, మండలి ఉపాధ్యక్షుడు సతీష్‌రెడ్డి, విప్ మేడా మల్లికార్జునరెడ్డి, శాసనసభ్యులు ఆదినారాయణరెడ్డి, జయరాములు, జిల్లా అధికారులు, పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.
కడప జిల్లా రైతులు బిందు సేద్యం ద్వారా పంటలు సాగు చేయాలని ముఖమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. సోమవారం వివిధ కార్యక్రమాలలో పాల్గొనే నిమిత్తం జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి తొలుత ఇటీవల మరణించిన మాజీ ఎంపీ గునిపాటి రామయ్య కుటుంబాన్ని రైల్వేకోడూరులో పరామర్శించారు.
తర్వాత రామాపురం మండలం నల్లగుట్టపల్లి చేరుకొని అక్కడి నీరు-చెట్టు పనులను పరిశీలించారు. అనంతరం కడపకు వచ్చిన ఆయన ఒక ప్రయివేటు ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన నీరు – ప్రగతి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అనంతపురం జిల్లాకు ఇస్తున్న మాదిరిగా కడప జిల్లా రైతులకు బిందు సేద్యం విషయంలో ప్రత్యేక ప్యాకేజీని వర్తింపజేస్తామన్నారు. కడప జిల్లాను ఉద్యాన పంటల హబ్ గా మారుస్తామన్నారు. అరటి, ఉల్లి వంటి వాణిజ్య పంటల సాగును ప్రోత్సహిస్తామన్నారు.
చంద్రన్నకు ప్రేమతో …
Saturday, March 3, 2018