కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న బాబురావు నాయుడు
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబురావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 50వ కలెక్టరుగా శుక్రవారం సాయంత్రం 4.35 నిమిషాలకు కలెక్టరేట్‌లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. బాబురావు నాయుడు 2006 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.
ఇక్కడ పనిచేసిన సత్యనారాయణ ఆం.ప్ర స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ గా ఉన్న బాబూరావు నాయుడును ప్రభుత్వం కడప జిల్లా కలెక్టరుగా నియమించింది.
బాధ్యతలు తీసుకున్న అనంతరం వేద పండితులు కొత్త కలెక్టర్‌ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందచేశారు. పలువురు అధికారులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్వేత, కలెక్టరేట్ సిబ్బంది, పలువురు అధికారులు పాల్గొన్నారు.
అనంతరం జరిగిన వీడ్కోలు సభలో బదిలీపై వెళుతున్న సత్యనారాయణ మాట్లాడుతూ కడప జిల్లా కులమతాలకు అతీతమన్నారు. అన్ని మతాలకు సంబంధించిన పండగలను ఎంతో గొప్పగా చేస్తారని తెలిపారు. కడపకు భవిష్యత్తులో తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వంద కోట్ల రూపాయలతో లింగంపల్లె వద్ద చెక్ డ్యాం నిర్మాణాన్ని నా మిత్రుడు బాబూరావు పూర్తి చేస్తాడన్నారు.
కొత్త కలెక్టరు బాబురావు నాయుడు మాట్లాడుతూ కేవీ సత్యనారాయణ తనకు 1996 నుంచి పరిచయం ఉందన్నారు. తక్కువ కాలంలో సత్యనారాయణ ఇన్ని మంచి పనులు చేయడం అభినందనీయమన్నారు. రాయలసీమలో పని చేయడం ఇదే మొదటిసారని చెప్పారు. కలసికట్టుగా పని చేసి జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని చెప్పారు.
***
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన బాబూరావు నాయుడు బదిలీపై వెళుతున్న కలెక్టర్ సత్యనారాయణ నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 50వ కలెక్టరుగా శుక్రవారం సాయంత్రం 4.35 నిమిషాలకు కలెక్టరేట్‌లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాబూరావు నాయుడు 2006 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.