బట్టలు విప్పి కొడతారా!

బట్టలు విప్పి కొడతారా!

విభజన జరిగితే ప్రత్యేక రాయలసీమ ప్రకటించాల్సిందే

తెలంగాణలో కలిపేందుకు కర్నూలు జిల్లా ఎవరి అబ్బ సొత్తు అని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు.

మంగళవారం ఆయన కల్లూరులోని స్వగృహంలో విలేఖరులతో మాట్లాడుతూ ఇటీవల జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కర్నూలు జిల్లాను తెలంగాణలో కలిపేందుకు డీల్లీ కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసిందన్నారు.

ఇలాంటి కోతి చేష్టలు ఇప్పటికైనా మానుకోవాలని, లేని పక్షంలో ప్రజలు బట్టలు విప్పి కొడతారని బైరెడ్డి హెచ్చరించారు.

చదవండి :  పట్టిసీమ మనకోసమేనా? : 1

రాష్ట్ర విభజన జరిగితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ప్రకటించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో రాయలసీమను చేర్చితే సీమవాసులు హీనంగా బతకాల్సివస్తుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలవడిన వెంటనే కేసీఆర్ మాట్లాడింది ఉద్యోగుల గురించి కాదని, రాయలసీమలోని ప్రాజెక్టుల గురించని సీమ నేతలు తెలుసుకోవాలని అన్నారు.

బైరెడ్డి గారు విమర్శలు చేసేటప్పుడు కొంత హుందాగా వ్యవహరించడం మంచిదేమో!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *