గురువారం , 21 నవంబర్ 2024
ప్రొద్దుటూరు

ప్రొద్దుటూరు పట్టణం

ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు (ఆంగ్లం: Proddatur లేదా Proddutur), వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ప్రొద్దుటూరు పట్టణ పాలన ‘ప్రొద్దుటూరు పురపాలక సంస్థ’ పరిధిలో జరుగుతుంది. ప్రొద్దుటూరుకు ‘ప్రభాతపురి’ అని మరో పేరు కూడా వుంది.

పేరు వెనుక కథ:

పూర్వం రామిరెడ్డి, రంగారెడ్డి అనే పాకనాటి కాపులు స్వదేశంలో క్షామం సంభవించినందున అక్కడి నుండి వలస వచ్చి పొదలపల్లె చేరినారంట. పొదలపల్లెలో ఉదయకాలంలో శంకుస్తాపన చేసి ఇల్లు కట్టుకొన్నారట. ఉదయకాలము గ్రామానికి శంకుస్తాపన చేసి కట్టినందువల్ల ఆ పొదలపల్లె ప్రొద్దుటూరు అయిందట. (ఆధారం: మెకంజీ కైఫియతు 1111-1-2).

మరొక కథనం:

పట్టణ శివారులోని రామేశ్వరంలో శ్రీరాముడు సైకత లింగాన్ని సూర్యోదయం వేళ ప్రతిష్టించినందువల్ల ఈ ప్రాంతానికి ప్రొద్దుటూరు (తెలుగులో ప్రొద్దు అనగా సూర్యుడు అని అర్థము) అనే పేరు వచ్చినట్లు స్థానికంగా ప్రచారంలో ఉంది. (ఆధారం: కడప జిల్లా గెజిటీర్ )

భౌగోళికం:

ప్రొద్దుటూరు పట్టణం భౌగోళికంగా 14°44’58.6″N  & 78°33’08.2″E (Latitude & Longitude) వద్ద ఉన్నది. ఇది సముద్ర మట్టానికి 160 మీటర్ల (524 అడుగులు) ఎత్తులో ఉన్నది.

ప్రొద్దుటూరు పట్టణం యొక్క వ్యాసార్ధం (radius) 3.5 కి.మీ, వైశాల్యం 38.5 చ.కి.మీ (9509.715 ఎకరాలు) మరియు చుట్టుకొలత (circumference) 22 కిలోమీటర్లు.

ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు పట్టణ పరిధి

హద్దులు:

ఉత్తరాన గోపవరం, దక్షిణాన పెన్నానది, తూర్పున లింగాపురం, పశ్చిమాన కొత్తపేట ప్రొద్దుటూరు పట్టణానికి సరిహద్దులుగా ఉన్నాయి.

చదవండి :  రాయచోటి వీరభద్రాలయం

జనాభా:

2011 జనాభా లెక్కల ప్రకారం ప్రొద్దుటూరు పట్టణ జనాభా 162,816 మంది కాగా వీరిలో పురుషులు 81,368 మంది,  స్త్రీలు 81,448 మంది. ప్రొద్దుటూరు పట్టణంలో అక్షరాస్యతా  శాతం 78.88. పురుషులలో అక్షరాస్యతా  శాతం 86.2గా ఉండగా, స్త్రీలలో అది 70.20గా ఉంది.

ప్రత్యేకత:

ప్రొద్దుటూరులోని పురాతనమైన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ ఆలయాన్ని తొలితెలుగు వాగ్గేయకారుడు శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు దర్శించికొన్నట్లు చారిత్రిక ఆధారాల వలన తెలుస్తోంది. ఇక్కడి చెన్నకేశవునిపైన అన్నమయ్య సంకీర్తనలు కూడా రాశారు.

దేశంలో మైసూరు తరువాత ఇక్కడే దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.  బంగారు దుకాణాలకు, అనేక వ్యాపారాలకు ప్రొద్దుటూరు ప్రధాన కేంద్రంగా ఉంది.

బ్రిటీషు కాలం నుండీ రాయలసీమలోనే ధనవంతమైన (అత్యధిక ధనికులున్న) పట్టణంగా  ప్రొద్దుటూరు వెలుగొందుతోంది. తెలుగు సినిమా పరిశ్రమకు పెట్టుబడిని సమకూర్చే ఫైనాన్షియర్లు పులువురు ఇక్కడ ఉన్నారు. పట్టణంలోని ప్రధాన వ్యాపారాలన్నీ సంఖ్యాపరంగా బలీయంగా ఉన్న ధనవంతులైన కోమట్ల అధీనంలోనే కొనసాగుతున్నాయి. (మూలం: కడప జిల్లా గెజిటీర్, 1914). చౌకైన వైద్యానికీ, టోకు (wholesale) వ్యాపార దుకాణాలకూ ప్రసిద్ధి.

పట్టణంలోని ప్రాంతాలు:

గాంధీ రోడ్డు, టిబి రోడ్డు, హోమస్ పేట, యైఎంఆర్ కాలని, మైదుకూరు రోడ్డు, రామేశ్వరం, కొర్రపాడు రోడ్డు,  శ్రీనగర్ కాలని, చౌటపల్లి, శివాలయం కూడలి, గౌస్ నగర్, భవాని నగర్, శెట్టిపల్లె, మోడంపల్లె, కో-ఆపరేటివ్ కాలని, ఆచార్ల కాలని, దస్తగిరిపేట, కాలవకట్ట వీధి, కోనేటికాలవ వీధి, బొల్లవరం, కొత్తపల్లె, హౌసింగ్ బోర్డ్ కాలని, నడింపల్లి, వసంతపేట

చదవండి :  400 ఏండ్ల రాయచోటి పత్తర్‌ మసీదు

దర్శనీయ స్థలాలు:

ఆధ్యాత్మికం: శివాలయం, రామేశ్వరం (ప్రత్యేకత: సైకత లింగం), అమ్మవారిశాల, వేణుగోపాల స్వామి ఆలయం (బొల్లారం) , సరస్వతి దేవి ఆలయం (శ్రీనివాస నగర్),  అయ్యప్ప గుడి,చౌడేశ్వరి ఆలయం, చెన్నకేశవాలయం

ఇతరాలు : దసరా ఉత్సవాలు

విద్యాసౌకర్యాలు:

ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య అభ్యసించేందుకు అవసరమైన అన్ని విద్యాసంస్థలు ప్రొద్దుటూరులో ఉన్నాయి. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాలలో – కేంద్ర, రాష్ట్ర పాఠ్య ప్రణాళికలను భోదించే విద్యాసంస్థలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వృత్తి విద్యను అందించేందుకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, వైఎస్ఆర్  ఇంజనీరింగ్ కళాశాల, ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రభుత్వ పశువైద్య కళాశాల అందుబాటులో ఉన్నాయి.

ప్రజారవాణా సౌకర్యాలు:

ప్రొద్దుటూరు పట్టణంలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్లేందుకు సర్వీసు ఆటోలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆటోలలో ఒకచోటు నుండి మరోచోటికి వెళ్ళటానికి కనీస చార్జి పది రూపాయలు.  బయటి వారిని చేరవేసేందుకు బస్సు స్టాండు, రైల్వే స్టేషన్ అందుబాటులో ఉన్నాయి.

దగ్గరి విమానాశ్రయం : కడప (43 KM) , తిరుపతి (191 km), బెంగుళూరు (260 KM), చెన్నై (327 KM),  హైదరాబాదు (367 KM)

దగ్గరి రైల్వేస్టేషన్ : ప్రొద్దుటూరు (2 KM) (ఎర్రగుంట్ల – నంద్యాల రైల్వే లైనులో భాగం), ఎర్రగుంట్ల (10 KM) (ముంబై – చెన్నై రైల్వే లైనులో భాగం)

చదవండి :  ఒంటిమిట్టకు 120 ప్రత్యేక బస్సు సర్వీసులు

వైద్య సౌకర్యాలు:

300 పడకల జిల్లా ఆసుపత్రితో పాటు అనేక ప్రయివేటు ఆసుపత్రులు ఉన్నాయి.

సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, క్యాన్సర్, మెదడు, గుండె సంబంధిత వ్యాధులను నిర్ధారించే కేంద్రాలు కానీ, వాటికి మెరుగైన చికిత్స అందించగలిగిన ఆసుపత్రులు కానీ అందుబాటులో లేవు. విషమ పరిస్థితులలో మెరుగైన వైద్యం కావాలంటే కడప, తిరుపతి, వేలూరు, కర్నూలు లేదా హైదరాబాదు వెళ్ళవలసి ఉంటుంది.

మొబైల్, ఇంటర్నెట్ సేవలు:

ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో అన్ని టెలికం కంపెనీలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి. 4జి సేవలు, 3జి సేవలు, బ్రాడ్ బ్యాండ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. నగరంలో పలు చోట్ల ఇంటర్నెట్ సేవలు అందించే కేంద్రాలున్నాయి.

వినోద కేంద్రాలు:

వినోదాన్ని అందించేందుకు నగరంలో సుమారు 10 వరకు సినిమా హాళ్ళున్నాయి. వీటిలో తెలుగు, ఇంగ్లీషు, హిందీ సినిమాలు ప్రదర్శితమవుతుంటాయి.

మద్యపాన ప్రియుల కోసం శీతల గదులతో కూడిన బార్‌లు (మద్యపానశాలలు) కూడా అందుబాటులో ఉన్నాయి.

వాతావరణం: ఉష్ణోగ్రత: 30°సె. – 44°సె (ఎండాకాలం), 21°సె. – 30°సె (చలికాలం), సగటు వర్షపాతము: 695 మి.మీ

సందర్శించేదానికి అనువైన సమయం: సెప్టెంబరు  – ఫిబ్రవరి మధ్య కాలం

పిన్ కోడ్ : 516360, 516361, 516361

ఎస్.టి.డి కోడ్ : 08564

 

ఇదీ చదవండి!

సిద్ధేశ్వరం

సిద్ధేశ్వరమా..! నీవెక్కడిదానవే? : పినాకపాణి

చంద్రబాబుకు కోపం వచ్చింది. పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసుల‌ను ఉసిగొలిపాడు. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: