
పోరొ పోరొ యమ్మలాల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పోరొ పోరొ యమ్మలాల బొమ్మలాటవారము యీరసాన మమ్ము నిట్టే యేమిసేసేరు ॥చ1॥ ఊరులేనిపొలమేర వొడలు మోచుకొని నేము తేరదేహ మెక్కుకొని తిరిగేము వారువీరనుచు వట్టివావులు సేసుక లేని- పేరు పెట్టుకొని లోలోఁ బిరువీకులయ్యేము ॥చ2॥ బుద్దిలేనిబుద్దితోడ పొందు సేసుకొని వట్టి- యెద్దుబండికంటి సంది నీఁగేము నిద్దురలో తెలివంటా నీడలోని యెండంటా వుద్దువుద్దులై లేనివొద్దిక నున్నారము ॥చ3॥ మాటులేనిమాటు దెచ్చి మరఁగు వెట్టుక వట్టి- మేటానమేట్లవలె మెరసేము గాటమైనతిరువేంకటగిరినిలయుని- నాటకమే నిజమని నమ్మిక నున్నారము |
రాగము: వరాళి రేకు: 0012-02 సంపుటము: 1-73 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళి