పోయఁబోయఁ గాలమెల్ల పూఁటవూఁటకు – అన్నమయ్య సంకీర్తన

పోయఁబోయఁ గాలమెల్ల పూఁటవూఁటకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పోయఁబోయఁ గాలమెల్ల పూఁటవూఁటకు
చేయి నోరు నోడాయ చెల్లఁబో యీరోఁతలు
॥చ1॥
తిప్పన తొప్పన కేతు దేవన బావన గనున్న
పప్పన బొప్పనగారి బాడిపాడి
కుప్పలుఁదెప్పలు నైనకోరికెలు మతిలోన
యెప్పుడుఁ బాయకపోయ నెన్ని లేవు రోఁతలు
॥చ2॥
కాచన పోచన మాచు కల్లప బొల్లప మల్లు
బాచన దేచనగారిఁ బాడిపాడి
యేచినపరసుఖము నిహమును లేకపోయ
చీచీ విరిగితిమి చెప్పనేల రోఁతలు
॥చ3॥
బుక్కన తిక్కన చెల్లు బూమన కామన పేరి-
బక్కల నిందరి నోరఁ బాడిపాడి
యెక్కువైన తిరువేంకటేశునిఁ దలఁచలేక
కుక్కకాటుఁ జెప్పుటాటై కూడె నిన్ని రోఁతలు
రాగము: సామంతం
రేకు: 0033-05
సంపుటము: 1-206

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చె

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *