రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ నేపధ్యంలో రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి జిల్లా స్థితిగతుల్ని వివరించారు. అనంతపురం జిల్లాలో కరువును దృష్టిలో ఉంచుకుని మెట్ట భూములు పదెకరాలు ఉన్నా పెన్షన్‌కు అర్హులుగా ప్రకటించారన్నారు.
అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న వైఎస్సార్ జిల్లాకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. వైఎస్‌ఆర్ జిల్లాలో సగటు వర్షపాతం 50 శాతంకు మించి నమోదు కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరులో అనంతపురం జిల్లా మాదిరిగా వెసులుబాటు కల్పించాలని కోరారు. వృద్ధులకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.
ప్రభుత్వం ఇప్పటికే కడప జిల్లాలోని 48 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. కాబట్టి కడప జిల్లాలో కూడా పరిస్తితులు అనంతపురం జిల్లాకు భిన్నంగా ఏమీ లేవు. శ్రీకాంత్ రెడ్డి సభలో ప్రస్తావించినట్లు ప్రభుత్వం మన జిల్లాలోని వృద్ధులను పరిగణలోకి తీసుకుని పించను ఇవ్వాలి.