పులివెందుల పేర మళ్ళా ఈనాడు పైత్యం

పులివెందుల పేర మళ్ళా ఈనాడు పైత్యం

తెలుగు రాష్ట్రాలలో అత్యధికులు చదివే పత్రికగా చెలామణి అవుతున్న ఈనాడు ఒక వార్తకు పెట్టిన హెడింగ్ ద్వారా మళ్ళా తన పైత్యాన్ని బయటపెట్టుకుంది. 9 నవంబరు 2018 నాటి మెయిన్ ఎడిషన్ 6వ పేజీలో మంగలి కృష్ణ తదితరుల మీద నమోదైన కేసుకు సంబంధించి ప్రచురించిన వార్తకు ఎగతాళిగా పులివెందుల పేర హెడింగ్ పెట్టి ఈనాడు తన దిగజారుడుతనాన్ని బయటపెట్టుకుందని రాయసీమవాదులు నిరసిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై రాయలసీమ సంఘాలు సామాజిక మాధ్యమాలలో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. ఇక కొందరైతే ఏకంగా ఈనాడు దినపత్రిక కార్యాలయానికి ఫోన్ చేసి ఈ విషయమై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

చదవండి :  ఈ రోజు వార్తల్లో కడప
ఈనాడు పైత్యం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిరసన

అనూహ్యమైన ఈ ఘటనతో ఈనాడు ఎడిటోరియల్ బృందం సదరు ఫోన్ల బారి నుండి తప్పించుకునేందుకు ఆపరేటర్లకు ఫోన్ కాల్స్ ని ఆపరేటర్లకు బడలాయిస్తున్నట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ విషయంలో ఈనాడు పైత్యాన్ని నిరసిస్తూ ఇదే విషయమై రాయలసీమ న్యాయవాదులు కొంతమంది ఈనాడుకు నోటీసులు పంపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా వైఎస్ కుటుంబం మీద వ్యతిరేకతను నరనరాన నింపుకున్న ఈనాడు సంపాదక బృందంలోని తెదేపా అనుకూలురు కొంతమంది సందు దొరికితే చాలు ఆ ద్వేషం మొత్తం పులివెందుల, కడప జిల్లాలకు ఆపాదించేందుకు ఉత్సుకత ప్రదర్శిస్తున్నారని పాత్రికేయరంగానికి చెందిన జిల్లా వాసులు వ్యాఖ్యానిస్తున్నారు.

చదవండి :  పులివెందులలో ‘అరటి పరిశోధనా కేంద్రం’

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *