పుట్టుమాలిన

పుట్టుమాలిన

॥పల్లవి॥
పుట్టుమాలిన
దిట్టే వదేమోసి దిమ్మరిమాయ
॥చ1॥
ఒరపులాడక పోవె వోసి మాయ నాతోఁ
దొరలేవు నిను ముట్ట దోసము
వెరపించే వేమోచి విష్ణుభక్తినంటా –
నెరఁగనటే నీయేతు లిన్నియును
॥చ2॥
వుదుటు చెల్లదు పోపో వోసి మాయ నా-
యెదుర మాఁటలు నీకు నిఁకనేలే,
వదరేపు హరిభక్తి వనిత, తెలియరు నే-
నిదురవుచ్చినవారు నీవు నా కెదురా
॥చ3॥
వొల్లవటే జీవ మోసిమాయ నీ
కల్లలిన్నియును లోక మెఱఁగును,
నల్లనివిభునిమన్ననభక్తినంటాఁ
జెల్లఁబో పాపపుచేఁదు మేయకువే
॥చ4॥
పూరకుండవుగా వోసిమాయ నిన్నుఁ
బేరఁ బిలువము గుంపెనలాడేవు,
నారాయణభక్తినాతి నన్నును నిన్నుఁ
గోరి యుందరు నెఱఁగుదు రేల పోవె
॥చ5॥
వోవవు ననుఁజూచి వోసిమాయ నా-
తోవ వచ్చినను నొత్తువు నీవు,
శ్రీ వేంకటగిరిదేవునిభక్తి నా –
హవళికే నిన్ను నలమి రిందరును
రాగము: సాళంగం
రేకు: 0018-01
సంపుటము: 1-107

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సాళంగం

చదవండి :  కప్పురమందుకొంటిఁ గడపరాయ - అన్నమయ్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *