పుట్టగులమ్మీ భువిఁ గొనరో
॥పల్లవి॥ పుట్టగులమ్మీ భువిఁ గొనరో జట్టికిని హింసలే మీ ధనము open open ॥చ1॥ ఆపద లంగడి నమ్మీఁ గొనరో పాపాత్ములు పై పయిఁ బడకా కైపులఁ బుణ్యులఁగని కోపించే- చూపులు మీ కివి సులభపు ధనము ॥చ2॥ కడుఁగుంభీ పాతకంబులు గొనరో బడిబడి నమ్మీఁ బాలిండ్ల తొడరుఁ బరస్త్రీ ద్రోహపుధనములె తడవుటె మీ కివి దాఁచిన ధనము ॥చ3॥ లంపుల చండాలత్వము గొనరో గంపలనమ్మీఁ గలియుగము రంపపు వేంకటరమణునికథ విన- నింపగు వానికి నిదే ధనము |
రాగము: ధన్నాసి రేకు: 0006-06 సంపుటము: 1-42 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాసి