పాలేటమ్మ తిరుణాళ్ళ ముగిసింది

పాలేటమ్మ తిరుణాళ్ళ ముగిసింది

చిన్నమండెం: కేశాపురం గ్రామం దేవళంపేటలో మంగళవారం సాయంత్రం సిద్దల బోనాలతో ప్రారంభమైన పాలేటమ్మ తిరునాళ్లలో రాత్రికి మొక్కులు ఉన్న భక్తులు కట్టిన చాందినీ బండ్లు, బాణ సంచా పేలుళ్లు, చెక్కభజనలు, కోలాటాలు, సంగీతవిభావరి అందరిని అలరించాయి. బుధవారం అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం వద్ద రద్దీ నెలకొంది.

జిల్లా నలుమూలల నుంచే కాకుండా చిత్తూరు జిల్లా సరిహద్దు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. అమ్మవారి దర్శనానికి ఎక్కువ సమయం వరుసలో నిల్చోవాల్సి వచ్చింది. తిరుణాళ్ళలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

చదవండి :  పులివెందులలో కొత్త సీఎస్ఐ చర్చి ప్రారంభం

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *