గురువారం , 21 నవంబర్ 2024

రేపటి నుంచి పాలేటమ్మ తిరుణాళ్ళ

చిన్నమండెం మండల పరిధిలోని కేశాపురం గ్రామం దేవళంపేటలో వెలసిన పాలేటమ్మ ఆలయం వద్ద 18వ తేదీ మంగళవారం నుంచి రెండు రోజులు తిరునాళ్ల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.

కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా పేరెన్నికగన్న పాలేటమ్మకు చిన్నమండెం, కలిబండ, పడమటికోన, బోనమల, కేశాపురం, జిల్లా సరిహద్దు గ్రామాల్లో ఆదివారం నుంచే బోనాలు సమర్పిస్తారు.

మంగళవారం ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. సాయంత్రం సిద్దల బోనాలు సమర్పించడంతో తిరునాళ్ల ప్రారంభమవుతుంది. మొక్కులు ఉన్నవారు కంటే చాందినిబండ్లు రాత్రికి తిరుగుతాయని, బుధవారం పగలు తిరునాళ్ల ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

చదవండి :  కడప జిల్లాలో సంక్రాంతి

ఇప్పటికే ఆలయానికి రంగులు అద్దారు. విద్యుత్తు దీపాలతో అలకరించారు. కడప- బెంగళూరు జాతీయ రహదారిలో అమ్మవారిని దీపాలతో ఏర్పాటు చేశారు.

జిల్లా నలుమూలల నుంచే చిత్తూరు, అనంతపురం జిల్లా సరిహద్దు మండలాల నుంచి వేల సంఖ్యలో ప్రజలు తరలిరానున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: