పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు

పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో వాడుకలో ఉన్న పారకోల లేదా పారకాల అనే పదానికి అర్థాలు, వివరణలు. Synonyms or Meanings of the word ‘పారకాల’ Telugu Language.

పారకోల లేదా పారకాల :

నామవాచకం (noun), ఏకవచనం (Singular)

  • ఒక వ్యవసాయ పనిముట్టు
  • కురిపె
  • బొరిగె
  • తవ్వుగోలు
  • దోకుడు బార (కోస్తా)
  • చెక్కుడు పార (తెలంగాణా)
  • కలుపు కత్తి (భద్రాచలం)
  • గొబ్బం

పారకోలలు లేదా పారకాలలు (Plural)

వివరణ :

చదవండి :  బీగం లేదా బీగము అనే పదానికి అర్థాలు, వివరణలు

కడప జిల్లాలో పారకోల అనేది ఒక వ్యవసాయ పనిముట్టు (ఫోటో చూడండి) . దాదాపు అడుగున్నర పొడుగు కొయ్యకు చివర ఱేకు అమర్చిన త్రవ్వు పనిముట్టు ఈ పారకాల. దీనిని కలుపు తీసేదానికి వాడతారు. మిరప, బెండ, టమోటా, పత్తి, చెరుకు మొదలగు ఆరుతడి పంటలలో కలుపు తీయటానికి కొడవళ్ళు, తొలికెలతో పాటుగా ఈ పారకోల్లను వాడతారు.

వాడుక:

  • ఓక్కా! కూలోల్లు వచ్చానారు. మీ పారకోల్లు ఇచ్చారా? మాయిటాల తెచ్చిచ్చం.
  • పారకోల్లు మొద్దుబోయినాయి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: