పాపినైననాపాలఁ గలిగి తోవ – అన్నమయ్య సంకీర్తన

పాపినైననాపాలఁ గలిగి తోవ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పాపినైననాపాలఁ గలిగి తోవ
చూపుమన్న నెందుఁ జూపరు
॥చ1॥
ధృతిదూలి జగమెల్లఁ దిరిగి వేసరితి
యితరాలయముల కేఁగియేఁగి వేసరితి
గతమాలి పరులపైఁ గనలి వేసరితి
మతిమాలి కులవిద్య మాని వేసరితి
॥చ2॥
విసిగి యాచారంబు విడిచి వేసరితి
పసచెడి ప్రియములు పలికి వేసరితి
కొసరి ద్రవ్యముపైఁ గోరి వేసరితి
కసుగంది లోలోనె కాఁగి వేసరితి
॥చ3॥
కోవిదులగువారిఁ గొలిచి వేసరితి
దైవములందరిఁ దడవి వేసరితి
శ్రీవేంకటేశునిసేవ మాని వట్టి-
సేవలన్నియు నేఁ జేసి వేసరితి
రాగము: సామంతం
రేకు: 0040-04
సంపుటము: 1-246

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  ఎన్నాళ్ళదాఁకఁ దానిట్టె వుండుట బుద్ది

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *