పరుసమొక్కటేకాదా పయిఁడిగాఁ జేసేది – అన్నమయ్య సంకీర్తన

పరుసమొక్కటేకాదా పయిఁడిగాఁ జేసేది – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పరుసమొక్కటేకాదా పయిఁడిగాఁ జేసేది
అరయ లోహమెట్టున్నా నందుకేమి
॥చ1॥
వనజనాభువిభక్తి వదలకుండినఁ జాలు
మనసు యెందు దిరిగినా మరియేమి
మొనసి ముద్రలు భుజముల నుండితేఁ జాలు
తనవెంతహేయమైనా దానికేమి
॥చ2॥
శ్రీకాంతునామము జిహ్వఁ దగిలితే జాలు
యేకులజుఁడైనాను హీనమేమి
సాకారుఁడైనహరి శరణుచొచ్చినఁ జాలు
చేకొని పాపము లెన్ని చేసిననేమి
॥చ3॥
జీవుఁడెట్టున్నానేమి జీవునిలో యంతరాత్మ
శ్రీవేంకటేశున కాచింతయేమి
యేవలవఁ బరమైన యిహమైన మాకుఁ జాలు
కైవశమాయ నతఁడు కడమలింకేమి
రాగము: సామంతం
రేకు: 0078-04
సంపుటము: 1-373

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  ఏదియునులేని దేఁటిజన్మము - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: