
పరిపూర్ణ గరుడాద్రి పంచాననం – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పరిపూర్ణ గరుడాద్రి పంచాననం పరమంసేవే పంచాననం ॥చ1॥ క్రూరదంష్ట్రాగ్నికణఘోర పంచాననం పారీణచక్రధర పంచాననం వీర పంచాననం విజయ పంచాననం భారభూభారహర పంచాననం ॥చ2॥ దివిజపంచాననం తీవ్రనఖకాననం భవనాశినీతీర పంచాననం కువలయాకాశసంఘోష పంచాననం పవిశబ్దదంతరవ పంచాననం ॥చ3॥ శ్రీవేంకటాఖ్యఘనశిఖరి పంచాననం పావనం పంచముఖ పంచాననం సేవిత ప్రహ్లదసిద్ది పంచాననం భావితం శ్రీయుక్త పంచాననం |
రాగము: నాట రేకు: 0087-06 సంపుటము: 1-428 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, నాట