పరదేశిపట్టణమున పదుగురునేగురుఁ గూడుక
॥పల్లవి॥ పరదేశిపట్టణమున పదుగురునేగురుఁ గూడుక పరగఁగ వరి చెడ నూదర బలిసినయట్లాయ lisinopril and driving lisinopriland.net lisinopril and driving open ॥చ1॥ ఊరేలెడియతఁ డలసత నూరకయుండఁగ నడుముల- వారలు నిక్కపుగర్తలవలె నుండినగతిని ధీరత చెడి తను జీవుఁడు దెలియఁగనేరక యుండిన ధారుణిలోపల దొంగలధర్మాసనమాయ ॥చ2॥ వొడలంతంతకుఁ జిక్కఁగ నుబ్బినరోగము సుఖమున- కెడమియ్యక నానాఁటికి నేఁచిన చందమున తడఁబడువిజ్ఞానము గతిదప్పఁగ బలుపగుపట్నము కడుఁజెడఁగా, మాలవాడ ఘనమైనట్లాయ ॥చ3॥ పొసఁగఁగ నిది గని యధికుడు పుక్కట కాండ్ల నందరిఁ బసమారిచి మొదలికర్తఁ బాలించినగతిని పసగలతిరువేంకటగిరిపతి నాదేహపుఁబురి నీ- వసమై వెన్నకు బండ్లు వచ్చినయట్లాయ |
రాగము: బౌళి రేకు: 0012-01 సంపుటము: 1-72 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి