పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి –

పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి –

॥పల్లవి॥
పనిలేని ధనవాంఛఁ బడిపొరలిన నిట్టి –
కనుమాయలే కాక కడ నేమిగలదు
open
॥చ1॥
కనుచూపు కాఁకలఁ గలయుట వెడయాస –
లనుభవింపుటగాక యందేమిగలదు
తనువల్లి సోఁకులఁ దగులుట మమతల –
నెనయఁ గోరుటగాక యిందేమిగలదు
॥చ2॥
యెలమి నధర మాను టెరిఁగి యెంగిలి నోర
నలముకొనుట గాక యందేమిగలదు
పలులంపటములచేఁ బడుట దు: ఖంబులు
తలఁజుట్టుటే కాక తన కేమికలదు
॥చ3॥
శ్రీ వేంకటాద్రీశుఁ జేరనిపనులెల్ల –
నేపగింతలే కాక యిందేమిగలదు
ఆవల సురతభోగ మనుభవింపఁబోయి
రావలయుటగాక రచనేమిగలదు
రాగము: శంకరాభరణం
రేకు: 0025-02
సంపుటము: 1-150

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శంకరాభరణం

చదవండి :  మానుషము గాదు మఱి దైవికము గాని

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *