‘పట్టిసీమ’ పేరుతో రాయలసీమకు గన్నేరుపప్పు పెడుతున్నారు: ఉండవల్లి

ఉపయోగం లేని ‘పట్టిసీమ’తో ‘పోలవరం’ రద్దయ్యే ప్రమాదం

సొంత మనుషుల కోసమే ‘పట్టిసీమ’

ముడుపుల కోసమే ప్రాజెక్టు అనేది వీరికే సాధ్యం

లేనిది ఉన్నట్లు నమ్మించడమే ముఖ్యమంత్రి నైజం 

కడప: ప్రజలను మభ్య పెట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… రాయలసీమకు, పట్టిసీమ ప్రాజెక్టుకు మధ్య సంబంధం ఏమిటో తనకు అర్థం కావడం లేదని ప్రజలను మభ్యపెట్టడానికే ఏపీ సర్కార్ పట్టిసీమకు తెరలేపిందని ఆరోపించారు. వాస్తవానికి పట్టిసీమకు, రాయలసీమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. జేబులు నింపుకోవడానికే పట్టిసీమను ప్రారంభించారని ఆయన ఆరోపించారు.

చదవండి :  15, 16న నామినేషన్ వేయనున్న జగన్, విజయలక్ష్మి

రాయలసీమకు పప్పన్నం పెడుతుంటే విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడాన్ని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుబట్టారు. రాయల సీమకు పప్పన్నం కాదు.. గన్నేరుపప్పు పెడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు.

అయినా తాత్కాలిక ప్రాతిపదికగా చేపట్టిన ప్రాజెక్టును చంద్రబాబు జాతికి అంకితమివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవేళ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతైనా జాతికి అంకితమిచ్చారా? అంటే, అదీ లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితమెలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తాటిపూడి ప్రాజెక్టుకు చెందిన నీటిని కృష్ణా నదిలో కలిపి పట్టిసీమ నీటిని నదిలో కలిపినట్లు కరలింగ్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు.

చదవండి :  సీమవాసుల కడుపుకొట్టారు

కృష్ణానదిలోకి మళ్లించిన నీరు తాటిపూడి ఆయకట్టు నీరని పట్టిసీమ నీరు కాదని స్పష్టం చేశారు. పట్టిసీమ ప్రాజెక్టుకపై సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండా పట్టిసీమ ఎందుకు తలపెట్టారని ప్రశ్నించారు.

పట్టిసీమ ప్రాజెక్టు వ్యవహారాన్ని చూస్తుంటే, దేవతా వస్త్రాల కథ గుర్తుకు వస్తోందన్నారు. నదుల అనుసంధానం పేరుతో గోదావరి నీటిని విశాఖపట్నంకు తీసుకొస్తానని సీఎం చంద్రబాబు గొప్పులు చెబుుతున్నారని ధ్వజమెత్తారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి అనేది చంద్రబాబు నాయుడు తన సొంత మనుషుల కోసం కట్టుకుంటున్న ప్రాకారమని మాజీ ఎంపీ ఉండవల్లి ఈ సందర్భంగా విమర్శలు చేశారు.

చదవండి :  హైదరాబాద్ లేకపోతే బతకలేమా!

గమనిక: వీడియో తప్పనిసరిగా చూడవలెను.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *