పట్టినచోనే వెదకి భావించవలెఁగాని – అన్నమయ్య సంకీర్తన

పట్టినచోనే వెదకి భావించవలెఁగాని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పట్టినచోనే వెదకి భావించవలెఁగాని
గట్టిగా నంతర్యామి కరుణించును
॥చ1॥
యింటిలోనిచీఁకటే యిట్టే తప్పకచూచితే
వెంటనే కొంతవడికి వెలుఁగిచ్చును
అంటి కానరానితనయాతుమ తప్పకచూచు-
కొంటేఁ దనయాతుమయు గొబ్బునఁ గాన్పించును
॥చ2॥
మించి కఠినపురాతిమీఁదఁ గడవ వెట్టితే
అంచెలఁ దానే కుదురై నయట్టు
పొంచి హరినామమే యేపొద్దు నాలికతుదను
యెంచి తలఁచఁదలచ నిరవౌ సుజ్ఞానము
॥చ3॥
వొక్కొక్కయడుగే వొగి ముందరఁ బెట్టితే
యెక్కువై కొండైనా నెక్కుఁ గొనకు
యిక్కువ శ్రీవేంకటేశు నిటు దినదినమును
పక్కనఁ గొలిచితే బ్రహ్మపట్ట మెక్కును
రాగము: బౌళి
రేకు: 0087-04
సంపుటము: 1-426

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి

చదవండి :  కొంచెమును ఘనముఁ గనుఁగొననేల - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: